సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురు పర్యాటకులు సజీవ సమాధి..

Published on Wed, 04/05/2023 - 18:58

గ్యాంగ్‌టాక్‌: మంచుసోయగాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు వచ్చిన పర్యాటకులను ప్రకృతి హిమపాతం రూపంలో కబళించింది. సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూలా ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్‌టాక్, నాథూ లాను కలిపే జవహర్‌లాల్‌ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్‌ మైలురాయి వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వద్దన్నా వినకుండా.. 
ప్రమాదం విషయం తెలియగానే సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌ఓ) సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానికులు అక్కడికి చేరుకుని 23 మందిని కాపాడారు. నెహ్రూ మార్గ్‌లో ఆగిపోయిన 80 వాహనాల్లోని 350 మందికిపైగా పర్యాటకులను సురక్షితంగా వెనక్కి పంపించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా 13వ నంబర్‌ మైలురాయి దాటాక సాధారణంగా పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, పర్యాటకులు ఘటనాస్థలి దాకా తీసుకెళ్లాలని టూర్‌ ఆపరేటర్లు, డ్రైవర్లను బలవంతపెట్టారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. చైనా సరిహద్దు సమీపంలో నాథూ లా మార్గముంది. వాణిజ్య సంబంధ రాకపోకలకు భారత్, చైనాలు వినియోగిస్తున్న మూడు సరిహద్దు పోస్ట్‌లలో నాథూ లా ఒకటి. సముద్రమట్టానికి 14,450 అడుగుల ఎత్తులోని మంచుమయమైన ఈ ప్రాంతాలను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం తెల్సిందే. గ్యాంగ్‌టాక్‌ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. ప్రమాదం జరిగాక క్షతగాత్రులను గ్యాంగ్‌టాక్‌కు పంపించి చికిత్సనందిస్తున్నారు.
చదవండి: విషాదం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరిచిన పారిశుద్ధ్య కార్మికులు.. కాసేపటికే..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)