Breaking News

రాంగ్‌ కాల్‌ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్‌ఐ ఆత్మహత్య

Published on Thu, 12/05/2024 - 11:54

సాక్షి, వరంగల్‌: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీశ్​ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్‌కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్‌లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్‌ఐ హరీష్‌ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.

ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్..​ ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్​మెంట్​ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్​ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)