Breaking News

బళ్లారి–సికింద్రాబాద్‌ మధ్యలో హత్య!

Published on Thu, 11/28/2024 - 08:08

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం హత్యకు గురైన మహిళ కేసుపై గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు (జీఆర్పీ) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ‘రైల్వే సీరియల్‌ కిల్లర్‌’ రాహుల్‌ను గుజరాత్‌లోని వల్సాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ అధికారుల విచారణలోనే ఈ మర్డర్‌ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ జీఆర్పీ అధికారులు నిందితుడిని పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్‌ రైళ్లల్లో సంచరిస్తూ 35 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కొన్నేళ్ల కోసం బతుకుతెరువు కోసం భర్త, పిల్లలతో కలిసి కర్ణాటకకు వలసవెళ్లింది. 

చివరకు రమణమ్మ, గోవిందప్ప దంపతులు బళ్లారి జిల్లాలోని సింపోటు తాలుకా, తోర్నగల్‌ గ్రామంలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె తన భర్త, కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటోంది. ఆమెను చూసేందుకే రమణమ్మను శనివారం రాత్రి 7 గంటలకు కుమారుడితో కలిసి అక్కడి తోర్నగల్‌ రైల్వే స్టేషష్‌ న్‌కు వచ్చింది. తల్లిని మణుగూరు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ మహిళల బోగీలో ఎక్కించిన కుమారుడు ఈ విషయాన్ని తన బావ వెంకటేశ్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. అదే రైలులోని దివ్యాంగుల బోగీలో ప్రయాణించిన రాహుల్‌ కన్ను ఈమెపై పడింది. మార్గమధ్యలో బోగీలో ఆమె ఒక్కరే మిగలడంతో అదును చూసుకుని పక్కనే ఉన్న సీట్‌ కమ్‌ లగేజ్‌ ర్యాక్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌) కోచ్‌లోకి లాక్కెళ్లిన అతను బాత్‌రూమ్‌లో టవల్‌తో మెడకు ఉరి బిగించి చంపేశాడు. 

అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్‌ తీసుకుని ఉడాయించాడు. ఆదివారం ఉదయం రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషష్‌ న్‌కు చేరుకోవడంతో అత్త కోసం  ప్లాట్‌ఫామ్‌ నెం.9 వద్దకు వచ్చిన వెంకటేశ్‌ మహిళల బోగీలో వెతికినా రమణమ్మ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె రైలు దిగి వెళ్లి ఉంటుందని భావించి అతడూ వెళ్లిపోయాడు. రైలు శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది హరికుమార్‌ బాత్‌రూమ్‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్టేషన్‌ మేనేజర్‌ ఎన్‌.నాగరాణి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  రైల్వే పోలీసులు హతురాలి కుటుంబీకులను రప్పించారు. 

గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని వల్సాద్‌ పోలీసుల అదుపులో ఉన్న రాహుల్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి ఈ వారెంట్‌ తీసుకోవడానికి వల్సాద్‌ పోలీసులకు రాహుల్‌ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. దీంతో ఆ అధికారులను సంప్రదించిన జీఆర్పీ పోలీసులు రికార్డులు తీసుకున్నారు. 

రమణమ్మ హత్య బళ్లారి–సికింద్రాబాద్‌ మధ్యలో జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కచ్చితంగా ఎక్కడ అనేది తేలియాలంటే నిందితుడిని తీసుకువచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని, ఆపై క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌లోనే ఇది తేలుతుందని చెబుతున్నారు. దానికి  కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)