అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!
Breaking News
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
Published on Tue, 07/02/2024 - 11:36
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తా
బస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.
హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.
ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024
Tags : 1