Breaking News

తప్పిన పెను ప్రమాదం

Published on Wed, 11/20/2024 - 07:58

కీసర: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొడుతూ వెళ్లి ముందున్న చెట్టు కు ఢీకొని నిలిచిపోయింది.  విప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చీర్యాల చౌరస్తాలోని ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు రోజు మాదిరిగానే కీసర, కీసరదాయర, రాంపల్లి దాయర, గోధుమకుంట, కుందన్‌పల్లిల నుంచిద్యార్థులను తీసుకుని వస్తోంది. 

ఈక్రమంలో కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచి్చన కారును తప్పించడానికి డ్రైవర్‌ బస్సును పక్కకు తిప్పాడు. వేగంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని కొట్టింది. స్తంభం విరిగి కింద పడిపోయింది. ఆ ధాటికి మరో రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకు ఒరిగాయి. కరెంటు తీగలు బస్సుపై పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు అదే వేగంతో చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. 

కాగా.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను బస్సు ఢీకొని ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ రాజు బస్సును అక్కడే వదిలేసి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. స్థానికంగా ఉన్న ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సులోంచి బయటకు దింపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను వాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)