Breaking News

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు..సర్పంచ్‌ భార్య ఆత్మహత్యాయత్నం

Published on Thu, 09/26/2024 - 05:42

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాస­రావుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్‌ భార్య కవిత ఆత్మహత్యకు యత్నించారు. 

ఎమ్మెల్యే అతనిని బహిరంగంగా దూషించడమే కాక బుధ­వారం చిట్టేల వెళ్లి దాడికి యత్నించడంతో ఆమె కలతచెంది నిద్రమాత్రలు మింగారు. ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యు­లు ఆమెను తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హుటా­హుటిన విజయవాడ తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్నారు.

ఎమ్మెల్యే వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి యత్నిస్తుండడంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తుమ్మ­లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరు­వూరు­లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించడమేకాక చిట్టేల వాగు నుంచి ఇసు­క తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరో­పిస్తూ అంతమొందిస్తాన­ని బెదిరించారని చెప్పా­రు. 

తిరువూరు మెయిన్‌­రోడ్డులో బహిరంగంగా త­న­­ను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపైకి ఉసిగొల్పుతు­న్నాడని సర్పంచ్‌ వివరించారు. చిట్టేలలో బుధ­వారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దురుసు ప్రవర్తన, దౌర్జన్యంతో ఆందోళనకు గురైన తన భార్య కవిత నిద్రమాత్రలు మింగిందని ఆవేదన వ్యక్తంచేశారు.  

గ్రామస్తుల ఆందోళన..
ఈ ఘటన నేపథ్యంలో చిట్టేల గ్రామస్తులు బుధ­వారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామ­ర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామి­దాసు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సుధారాణి çకూడా పరామర్శించిఅండగా ఉంటామని చెప్పారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)