Breaking News

చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష..

Published on Fri, 09/13/2024 - 05:53

సంగారెడ్డి జోన్‌: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచి్చంది. బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి కోర్టు మరణ శిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ తెలిపారు. ఆయన గురువారం ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని సికిందర్‌ ప్రాంతానికి చెందిన గఫాఫర్‌ అలీఖాన్‌ (61) బీడీఎల్‌ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత అక్టోబర్‌ 16న ఆదిత్రి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్‌ అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.

11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారికి నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్‌డ్రింక్‌ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని చిన్నారిని అక్కడే హత్య చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్‌ భానూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చార్జ్‌షీటు దాఖలు చేశారు. 

కేసు పూర్వాపరాలు విన్న ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి.. బాలికపై హత్యాచారం చేసిన గఫాఫర్‌ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. అతడి కుటుంబ సభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. 

27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్ష: 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్‌ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్‌ఐ, విచారణ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లను ఎస్పీ అభినందించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)