Breaking News

సాహితీ ఇన్‌ఫ్రాకు షాక్‌.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్‌

Published on Thu, 03/07/2024 - 10:19

సాక్షి, హైదరాబాద్‌: సాహితీ ఇన్‌ఫ్రాకు సీసీఎస్‌ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు  బిగుస్తోంది.

రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో  లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్‌ పోలీసులు గాలిస్తున్నారు. 

ప్రీలాంచ్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా (ఎస్‌ఐవీఐపీఎల్‌) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది.

టీఎస్‌–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్‌ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్‌ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు.

ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్‌ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో డిపాజిట్లను సేకరించాడు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు