Breaking News

హైవేలపై ఆగి ఉన్న మృత్యువు

Published on Wed, 05/01/2024 - 04:54

సాక్షి, హైదరాబాద్‌: కొందరి నిర్లక్ష్యం మరికొందరిపాలిట మృత్యుపాశమవుతోంది. అనుమతి లేకున్నా జాతీయ రహదారుల వెంట నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు ఢీకొని దుర్మరణంపాలవుతున్నారు. జాతీయ రహదారుల్లో వేగంగా దూసుకెళ్లే వాహనదారులు ముందు ఆగిన లారీలు, భారీ ట్రక్కులను గుర్తించే లోపే నష్టం జరిగిపోతోంది. 

ఏప్రిల్‌ 25న కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 22న సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు మొత్తం కంటైనర్‌ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ప్రమాదాలు పెరుగుతుండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

రోజుకో రోడ్డు ప్రమాదం.. మూడు రోజులకొకరు మృతి  
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ తరహాలో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను ఢీకొట్టడం కారణంగా ప్రతి రోజూ కనీసం ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల కారణంగా ప్రతి మూడు రోజులకు ఒకరి చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

2018 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 600 మంది మృతి చెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 2022లో తెలంగాణలో మొత్తం 331 రోడ్డు ప్రమాదాలు ఈ తరహాలో జరగ్గా, 128 మంది మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల మధ్య జరగడం గమనార్హం. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆగిఉన్న లారీలను ఢీకొట్టే కార్లు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

హైవేలపై పార్కింగ్‌ చేస్తే చర్యలు తప్పవు
జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు నిలిపి ఉంచడం, పార్కింగ్‌ చేయడం చట్ట ప్రకారం నేరం. అలా వాహనాలు నిలిపితే ఐపీసీ 304 సెక్షన్‌ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 జాతీయ రహదారుల వెంట ఉన్న పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఈ తరహాలో వాహనాలు నిలపకుండా పెట్రోలింగ్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ఆ వేళల్లో పోలీసులను మరింత అప్రమత్తం చేసేలా సర్క్యులర్‌ను జారీ చేస్తాం.  – మహేష్‌ భగవత్, తెలంగాణ రోడ్డు  భద్రత విభాగం అడిషనల్‌ డీజీ  

ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన నిర్లక్ష్యం ఇలా..  
» జాతీయ రహదారుల వెంట వాహనాలు నిలిపి ఉంచవద్దని నిబంధనలు ఉన్నా.. భారీ ట్రక్కులు, లారీల డ్రైవర్లు కొందరు వీటిని విస్మరిస్తున్నారు.  
»   ఏదైనా మరమ్మతుల కారణంగా వాహనం తప్పక ఆపాల్సి వస్తే వెనుక నుంచి వాహనదారుడికి ఆ విషయం తెలిసేలా పార్కింగ్‌ లైట్లు తప్పక ఆన్‌ చేసి పెట్టాలి. సేఫ్టీ ట్రైయాంగిల్‌ ఆకారాన్ని వాహనానికి కొంత దూరంలో పెట్టాలి.  
»    జాతీయ రహదారుల వెంట ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలిపి ఉంచాలి. కానీ చాలామంది అలా చేయడం లేదు  
»    డ్రైవర్‌ అలసిపోయినప్పుడు తెల్లవారుజాము సమయంలో వాహనాన్ని జాతీయ రహదారి వెంటే నిలిపి ఉంచి నిద్రిస్తుండడం సైతం మిగిలిన వాహనదారులకు మృత్యుపాశమవుతోంది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)