Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
అంత్యక్రియలకొచ్చి అనంతలోకాలకు.. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
Published on Thu, 05/25/2023 - 03:23
అక్కన్నపేట(హుస్నాబాద్): బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కారు అదుపు తప్పి చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్(43), సురేష్(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామంలో చిన్నాన్న ఎరుకుల కనకయ్య మృతి చెందడంతో వారంతా కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు.
అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి, కారులో సూరత్‌కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటికి మరొకరు మృతి చెందారు. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం మే 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
Tags : 1