Breaking News

మాపై సీఐడీ కేసు కొట్టేయండి

Published on Wed, 10/18/2023 - 03:14

సాక్షి, అమరావతి : తమపై సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రామోజీరావు తమను తుపాకీతో బెదిరించి, సంతకాలు ఫోర్జరీ చేసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమకున్న షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ అయిన శైలజా కిరణ్‌ పేరు మీద అక్రమంగా బదలాయించుకున్నారని మార్గదర్శి ఫైనా­న్సి­యర్స్‌లో వాటాదారు అయిన జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఆరోపణలకు ప్రాథమిక ఆధా­రాలు ఉండటంతో సీఐడీ అధికారులు రామోజీరావు ఏ1గా, శైలజా కిరణ్‌ ఏ2గా కేసు నమోదు చేశారు.

ఈ కేసును కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్‌ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. రామోజీరావు, శైలజా కిరణ్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలు మొదటిసారి విచారణకు వస్తున్నందున కేసు పూర్తి వివరాలను తెలుసుకుని, వాటిని కోర్టు ముందుంచాల్సి ఉందని, అందువల్ల విచారణను గురు­వారానికి వాయిదా వేయాలని శివకల్పనారెడ్డి కోరారు. లూథ్రా జోక్యం చేసుకుంటూ.. ఈలోపు పిటిషనర్లను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.

ఈలోపు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పోసాని వెంకటేశ్వర్లు కోరా­రు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈలోపు పిటిషనర్ల విష­యంలో కఠిన చర్యలేవైనా తీసుకోబోతున్నారా.. అని శివకల్పనారెడ్డిని ప్రశ్నిం­చారు. ఈలోపు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని శివకల్పనారెడ్డి చెప్పారు. బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోబోమంటే విచార­ణను వాయిదా వేస్తానని న్యాయ­మూర్తి తెలిపారు. దీంతో అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని శివకల్పనా­రెడ్డి చెప్పారు. దీనిని రికార్డ్‌ చేసిన న్యాయమూర్తి తదు­పరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)