Breaking News

మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్‌

Published on Mon, 04/28/2025 - 08:51

జైపూర్‌: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని భావన యాదవ్‌ (25) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. శరీరంపై కత్తిపోట్లు, తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భావన మృత్యువుతో పోరాడి మృతి చెందారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ ప్రకారం..రాజస్థాన్‌ రాష్ట్రం హిసార్ జిల్లాకు చెందిన భావన యాదవ్‌ (25) వైద్య విద్యార్థిని. 2023లో పిలిప్పిన్స్‌లో 
ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. విదేశాల్లో తన పోస్టు గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ కోర్సులైన డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండీ), మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ(ఎంఎస్‌)చదివేందుకు కావాల్సిన మెడికల్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే పరీక్షల కోసం ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆమె వారం వారం రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి వస్తారు. అనంతరం, తిరిగి తన స్వగ్రామానికి వెళ్లే వారు.

ఎప్పటిలాగే రాజస్థాన్‌ నుంచి ఢిల్లీలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న తన అక్క రూంకు వచ్చారు. ఏప్రిల్ 21, 22న పరీక్షలు రాసి ఏప్రిల్‌ 23న తన తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. ఏప్రిల్‌ 24న ఉదయం ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఆమె ఇంటికి వెళ్లలేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరింది. 

ఏప్రిల్ 24 న ఉదేష్ యాదవ్ అనే వ్యక్తి ఆమె తల్లి గాయత్రికి ఫోన్‌ చేశాడు. భావన తీవ్రంగా కాలిన గాయలయ్యాయని, అత్యవసర చికిత్స నిమిత్తం హిసార్‌లోని సోని హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో గాయత్రి సోని ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఘటన తాలుకూ వివరాలు కనిపెట్టలేకపోయింది. భావన తీవ్రంగా కాలిపోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం జైపూర్‌ తరలించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 24న రాత్రి మరణించడం విషాదంగా మారింది.

వైద్యం జరిగే సమయంలో భావన శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించానని, ఆ తర్వాత ఆమెను తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు గాయత్రి యాదవ్‌ జైపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెది సహజ మరణం కాదని, హత్య చేసేందుకు కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ.. భావన ల్యాప్‌ టాప్, మొబైల్ ఫోన్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు అందుబాటులో  లేవని కూడా చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)