Breaking News

గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్..

Published on Mon, 05/15/2023 - 14:04

చండీగఢ్‌: పంజాబ్ పాటియాలలో షాకింగ్ ఘటన జరిగింది. దుక్నివరణ్ సాహిబ్‌ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

మృతురాలిని పర్మీందర్‌ కౌర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమె వయసు 32 ఏళ్లు. పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది. ఆదివారం సాయంత్రం గురుద్వారా ఆవరణలో మద్యం సేవించింది. ఈ సమయంలో ఆమెను చూసిన సాగర్ మల్హోత్రా అనే సేవాదార్‌ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనితో ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం పర్మీందర్ కౌర్‌ను గురుద్వారా మేనేజర్ దగ్గరకు తీసుకెళ్తుండగా.. ఈ సమయంలో అక్కడున్న మరో సేవాదార్‌ మహిళ తీరుపై ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో సాగర్ మల్హోత్రాకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)