Breaking News

దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు

Published on Fri, 09/22/2023 - 04:32

అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యా­లయ ఆవరణలో జరిగిన జంట హత్య­లు  కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి త­గా­దాలు, పాత కక్షలు భార్య భర్తలను బలి­తీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నా­రు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎక­రాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ము­డు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి.

అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకే­శ్, భువనేశ్‌ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్‌ చేయ­గా లింక్‌ డాక్యుమెంట్స్‌ లేవంటూ వీఆర్‌వో, ఆర్‌ఐలు రిజక్ట్‌ చేశారు. దీనిపై వివరణ కో­రేం­దుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు­్గరితో కలిసి గురు­వారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్‌వో కార్యాలయానికి వ­చ్చింది.

ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు.

గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్‌.వెంకటనారాయణ, కూచి­పూడి ఎస్‌ఐ డి.సందీప్‌ ఘటనా స్థలానికి వ­చ్చి పరిశీలించారు. వారు మీడియాతో మా­ట్లా­డుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడు­కులే హత్యలకు కారణమని వెల్ల­డించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృ­తులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)