Breaking News

Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది..

Published on Wed, 05/24/2023 - 16:20

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట్‌ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.

నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.

కాగా, మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్‌లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు.
చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)