Breaking News

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా

Published on Tue, 10/10/2023 - 04:23

మహబూబ్‌నగర్‌ క్రైం/ జడ్చర్ల టౌన్‌: ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల– పాలమూరు ప్రధాన రహదారిపై జాలీహిల్స్‌ సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి 43 మంది విద్యార్థులతో వస్తున్న బస్సు పాఠశాలకు సమీపంలో యూటర్న్‌ తీసు కోగా.. రోడ్డు డౌన్‌ ఉండటం వల్ల వెనకాల వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.

ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. బస్సు బోల్తా పడగానే స్థానికులు వెంటనే గా యపడిన విద్యార్థులను చికిత్స కోసం ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9మంది విద్యార్థుల తలల కు గా యాలు కాగా.. మరో 8 మందికి స్వల్ప గాయాల వడంతో  వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పాఠశాల ప్రిన్సిపాల్‌ సురేశ్‌ తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కొందరు లారీ డ్రైవర్‌ను చితకబాది  పోలీసులకు అప్పగించారు. 

పరామర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
బస్సు ప్రమాదంలో గాయపడి ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటించడంతో పాటు సైన్‌ బోర్డులు, లైనింగ్స్‌ పెంచేలా చూస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, సీనియర్‌ నాయకుడు నాగురావు నామాజీ కూడా  విద్యార్థులను పరామర్శించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)