Praneeth Rao: ట్యాపింగ్‌ తీగ లాగితే..

Published on Wed, 03/20/2024 - 10:05

హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాలుగో రోజు  విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ప్రణీత్ రావు నుంచి  కీలక విషయాలు రాబడుతోంది దర్యాప్తు బృందం. ఈ క్రమంలో ప్రణీత్ రావు మరికొందరు అధికారుల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ అధికారులకు నోటీసులు ఇచ్చి, వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇక విచారణలో ప్రణీత్‌ రావు..ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్, పరికరాలు తీసుకువచ్చి వాడినట్టు ఒప్పుకన్నారు. అయితే టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు గుర్తించారు. అందుకోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు  చేస్తున్నారు. కానీ ప్రణీత్‌ రావు మాత్రం విచారణ ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ అధికారుల ఆదేశాల మేరకు చేశానని చెబుతుండటం గమనార్హం. దీంతో ఈ కేసులో మరొకందరిక నోటీసులు, కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ట్యాపింగ్‌ కేసు నిందితుడు ప్రణీత్‌రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్‌లో ఆరోపించారు.  ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే పోలీసుల నుంచి వివరణ కోరింది. మరోవైపు.. తనను దర్యాప్తు చేస్తున్న టీంలో ఇంటలిజెన్స్ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, అలాగే SIB అడిషనల్ ఎస్పీ రమేష్ విచారణలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్‌ రావు కోరడం గమనార్హం.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)