Breaking News

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు పరార్‌!

Published on Thu, 03/21/2024 - 18:50

సాక్షి, హైదరాబాద్‌: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్‌ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌కు అండగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌  ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్‌రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

2018 నుంచే అక్రమ ట్యాపింగ్‌ దందా మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఇజ్రాయిల్‌ నుంచి అత్యాధునిక ఉపకరణాలు ఖరీదు చేయగా, రామ్‌ గోపాల్‌ కన్సల్టెంట్‌, అడ్వైజర్‌గా వ్యవహరించారు. ఆదిలాబాద్‌ ఘర్షణ సమయంలో అక్కడ వినియోగించినట్లు గుర్తించారు. ప్రణీత్‌రావు కేసులో మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు.

కాగా, మాజీ ఐపీఎస్‌, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు బంధువే ఈ ప్రణీత్‌ రావు. ప్రణీత్‌ కెరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్‌ రావు అండగా ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్‌ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్‌ ప్రొబేషన్‌ క్లియరెన్స్‌ అయ్యింది. అలాగే.. ప్రభాకర్‌ రావు ఎస్‌ఐబీ చీఫ్‌ కాగానే.. ప్రణీత్‌కు ఎస్‌ఐబీలో పోస్టింగ్‌ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్‌ఐబీలో ఉన్న ఇతర ఇన్‌స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్‌ ఇప్పించారని ప్రభాకర్‌ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)