Breaking News

మీర్‌పేట్‌ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు

Published on Sat, 01/25/2025 - 18:45

సాక్షి,హైదరాబాద్‌: సంచలనం రేపిన మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే  వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్‌ కేసును పోలీసులు హత్య కేసుగా  మార్చారు. క్లూస్‌ టీమ్‌ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్‌ఎస్‌(BNS) 101 సెక్షన్‌  పెట్టారు.

క్లూస్‌ టీమ్‌ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వీటితో మాధవి  డీఎన్‌ఏ మ్యాచింగ్‌ కోసమే ఫోరెన్సిక్‌ పరీక్షలకు పోలీసులు  నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్‌ఏ నివేదిక  చేరనుంది. డీఎన్‌ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.

ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్‌ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.

కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. డీఎన్‌ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. 

 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు