Breaking News

మందలించారని ఉరేసుకున్నారు

Published on Tue, 12/31/2024 - 00:59

యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం)/ గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీలో ఉంటూ, ఏఎల్‌పీ గనిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కొండిల్ల శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సాయి అవినాష్‌ (20) డిప్లొమా చదువుతూ వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యాడు.

అతడి కోరిక మేరకు తండ్రి మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో చదివిస్తున్నాడు. ఈనెల 29న ఇంటికి వచ్చిన అవినాష్‌.. ఆదివారం రాత్రి బయటకు వెళ్తానని, బైక్‌ కావాలని తండ్రిని అడిగాడు, రాత్రి సమయంలో బయటకు వెళ్లద్దని, బైక్‌ ఇవ్వనని తండ్రి చెప్పడంతో కలత చెందిన అవినాష్‌.. తెల్లవారు జామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరో ఘటనలో తల్లిమందలించిందన్న మనస్థాపంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ముక్క రోహక్‌(16) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. రోహక్‌ మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ ఎస్టీపీసీలోని సచ్‌దేవ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా వెళ్లడంలేదు. కనీసం ప్రీ ఫైనల్‌ పరీక్షలు కూడా రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఆదివారం కూడా బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇలా చేస్తే కెరీర్‌ పాడవుతుందని, పద్ధతి మార్చుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రోహక్‌ పెంట్‌హౌస్‌ ఇనుపరాడ్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)