బాలిక హత్య.. బాబాయే హంతకుడు?

Published on Fri, 09/29/2023 - 02:50

సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.  తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14).

పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్‌ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా,  బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)