Breaking News

కోలుకోలేని విషాదం.. కొడుకు మృతదేహంతో పుట్టినరోజు కేక్‌ కటింగ్‌

Published on Sat, 05/20/2023 - 10:52

సాక్షి, ఆసిఫాబాద్‌ : అంత్యక్రియల రోజే కుమారుడి చివరి జన్మదిన వేడుక నిర్వహించాల్సి రావడం కన్నా విషాదం ఏముంటుంది. ఇరవై ఏళ్లు కూడా నిండని కుర్రాడికి.. తెల్లవారితే పుట్టినరోజు.. వేడుకలకు అంతా సిద్ధమవుతుండగా.. హఠాన్మరణం చెందడంతో ఆ ఇంట కోలుకోలేని విషాదాన్ని నింపింది. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌లో శుక్రవారం కంటతడి పెట్టించిన ఈ సంఘటన వివరాలివి.

గ్రామానికి చెందిన చునార్కర్‌ గుణాంతరావు, లలిత దంపతుల చిన్న కుమారుడు సచిన్‌ (15) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం పుట్టినరోజు కావడంతో స్నేహితులతో వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కడుపులో మంటతో ఇబ్బందిపడడంతో ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు.

అ‍క్కడ బాలుడు అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో సాయంత్రం మృతిచెందాడు. తెల్లవారితే జన్మదినోత్సవం జరుపుకోవాల్సిన అతడి మరణం మిత్రులు, కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. శుక్రవారం పుట్టినరోజు కావడంతో అదేరోజు అర్ధరాత్రి చివరిసారిగా తల్లిదండ్రులు మృతుని చేతితో కేక్‌ కట్‌ చేయిస్తూ గుండెలు పగిలేలా విలపించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)