Breaking News

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఇద్దరి హత్య

Published on Sat, 11/23/2024 - 06:05

వాజేడు: పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారనే నెపంతో మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు పోలీసు స్టేషన్‌కు సుమారు అరకిలో మీటరు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు మండల పరిధి బాలలక్ష్మీపురం (పెనుగోలు కాలనీ) గ్రామంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉయిక అర్జున్‌ (38) ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. వారు అర్జున్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఆరుబయట గొడ్డళ్లతో నరికారు.

అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు ఉయిక రమేశ్‌ (38) ఇంటికి వెళ్లి మంచంపై పడుకున్న రమేశ్‌ను గొడ్డళ్లతో నరికి వెళ్లిపోయారు. రమేశ్‌ కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగానే అతను చనిపోయాడు. పేరూ రు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేశ్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులు కాయడానికి అడవుల్లోకి వస్తున్న అర్జున్‌ తమ దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, ఇతనితోపాటే ఉయిక రమేశ్‌ కూడా పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నాడని వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఘటనాస్థలంలో వదిలిన రెండు లేఖల్లో మావోయిస్టులు పేర్కొన్నారు.  

అమాయకులను హత్య చేశారు
ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన ఉయిక రమేశ్, ఉయిక అర్జున్‌ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు, గిరిజనులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసుకు వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుగా పెట్టి పెనుగోలు కాలనీకి వెళ్లే దారి వద్ద వాజేడు, వెంకటాపురం(కె) రహదారిపై ధర్నాకు దిగారు.

ఇన్‌ఫార్మర్‌ ముద్ర వేసి అమాయక గిరిజనులను మావోయిస్టులు అన్యాయంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రమేశ్‌ భార్యకు నెలరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు ఏటూరునాగారం ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు