Breaking News

కాటేసిన కల్తీ కల్లు

Published on Thu, 08/22/2024 - 01:09

అనంతగిరి: కల్తీ కల్లు తాగి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 29 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలివి. వికారాబాద్‌ జిల్లా పీరంపల్లిలోని ఒక దుకాణంలో 19వ తేదీ సోమవారం సాయంత్రం కల్లు తాగిన వారిలో.. ఎనిమిది మంది మంగళవారం వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధి తులను వారి కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించగా అర్ధరాత్రి తర్వాత దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందారు. 

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయాన్నే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. శిబిరానికి వచ్చిన మరో 22 మంది పరిస్థితి బాగా లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ప్రస్తుతం 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారు డిశ్చార్జి అయ్యారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో దయానంద్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రవి, పీహెచ్‌సీ వైద్యుడు సుధాకర్‌రెడ్డి గ్రామంలో పర్యటించారు. 

బాధితుల ఇళ్లు, నీటి ట్యాంకులను పరిశీలించారు. నీరు కలుషితం కాలేదని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఆరా తీశారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు సైతం కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్తీ లక్షణాల్లేవని ఆ శాఖ సీఐ రాగవీణ స్పష్టం చేశారు.

 

#

Tags : 1

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)