Breaking News

కూతురిని కాలేజీకి పంపించేందుకు వెళ్తూ..

Published on Wed, 03/22/2023 - 09:16

వరంగల్: కన్నబిడ్డను కాలేజీకి పంపుదామని బయలుదేరిన ఆ తండ్రిని విధి కబలించింది. కళ్లముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తె గుండెలవిసేలా రోదించింది. తనను సాగనంపడానికి వచ్చి కానరానిలోకాలకు పోతివా.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూర్‌ సమీపంలోని 163 జాతీయ రహదారిపై మంగళవారం కంటైనర్‌ లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న రైతు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపురం(కె) చెందిన పోలిన శ్రీనివాసరావు (58) తన కుమార్తె పోలిన శృతిని హైదరాబాద్‌లోని కాలేజీకి పంపించేందుకు తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఇదే క్రమంలో 163 జాతీయ రహదారిపై ఇసార్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఎదురుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె శృతికి తీవ్రగాయాలయ్యాయి.  అదే సమయంలో ములుగు వెళ్తున్న వెంకటాపురం జెడ్పీటీసీ పాయం రమణ ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన శృతిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తన వాహనంలో తీసుకువచ్చి చికిత్స అందించారు.

సంఘటన స్థలాన్ని ఎస్సై ఇందయ్య పరిశీలించి కారులో ఇరుక్కుపోయి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కు మారులు, కుమార్తె హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)