Breaking News

సెల్ఫీ సరదా ప్రాణం తీసింది: ముగ్గురు విద్యార్థినుల దుర్మరణం

Published on Mon, 07/05/2021 - 10:12

సాక్షి, నిర్మల్‌: ముగ్గురు కలసి సరదాగా గడపాలనుకున్నారు. కలసి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆడారు... పాడారు.. ఆ ఆనంద క్షణాలను భద్రంగా దాచుకోవాలని సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఆ సెల్ఫీలే మృత్యుదారికి తీసుకెళతాయని వారు ఊహించలేదు. నిర్మల్‌ జిల్లా త నూర్‌ మండలం సింగన్‌గాం గ్రామానికి చెందిన ఎల్మె దాదారావ్, మంగళబాయి దంపతులకు కూతుళ్లు స్మిత, వైశాలి, కుమారుడు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్మిత, వైశాలి తల్లితో కల సి పొలం వద్దకు వెళ్లగా.. వారి వెంట బంధువుల అమ్మాయి లహుబందే అంజిలి కూడా వెళ్లింది. పొలం వద్ద మంగళబాయితో కాసేపు ఉన్నారు.  పొలం వద్దే సెల్ఫీలూ దిగారు.

అనంతరం ఇంటికి వెళ్తున్నామంటూ మంగళబాయికి చెప్పి ముగ్గురు కలిసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. సెలీ్ఫలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులోని నీటి గుంతలో పడిపోయారు. ఈత రాకపోవడంతో అక్కాచెల్లెళ్లు ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజిలి (16) నీట మునిగి దుర్మరణం చెందారు. సాయంత్రం మంగళబాయి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగా ముగ్గురూ ఇంటికి రాలేదు. దీంతో ఆమె పొలం వద్దకు వెళ్లి వెతికింది. జాడలేకపోవడంతో బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువుకు వెళ్లి చూడగా నీటి గుంతలో స్మిత, వైశాలి, అంజిలి మృతదేహాలు లభించాయి.

Videos

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)