Breaking News

ప్రేమించి పెళ్లాడి.. ఆత్మహత్య

Published on Thu, 05/16/2024 - 11:56

సాక్షి బళ్లారి/ హుబ్లీ: ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నవ దంపతులు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ విధి మరోలా తలచింది. అంతు తెలియని సమస్యలతో ఆ జంట ఆత్మహత్య చేసుకున్న  విషాద సంఘటన విజయపురలో చోటు చేసుకుంది.  
వివరాలు.. విజయపుర నగరంలోని సిద్దేశ్వర బడావణెలో నివాసం ఉంటున్న మనోజ్‌కుమార్‌ పోలా (30), రాఖీ (23) అనే యువతీ యువకులు ప్రేమలో పడ్డారు. 

నాలుగు నెలల క్రితం పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకొన్నారు. మనోజ్‌ తల్లి ఇంట్లోనే ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని మంగళవారం రాత్రి ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మనోజ్‌కుమార్‌ తల్లి ఊరికి వెళ్లి బుధవారం ఉదయమే తిరిగి రాగా ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై జలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని స్థానికులు తెలిపారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)