Breaking News

‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం

Published on Thu, 06/22/2023 - 16:43

సాక్షి, నెల్లూరు: అసత్య కథనాలతో రోజురోజుకు దిగజారుతున్న ఈనాడు రామోజీరావుకు షాక్‌ తగిలింది. నెల్లూరు జిల్లాలో పని చేసే నలుగురు ఈనాడు రిపోర్టర్ల పై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నుడాలో అక్రమాలు అంటూ.. 2022లో ఈనాడులో వచ్చిన కథనంపై అప్పటి వీసీ రమేష్‌ కోర్టుకు వెళ్లారు.

దళితుడు కావడంతోనే తనపై అసత్యాలు రాశారని.. తనకు న్యాయం చేసి.. రోత రాతలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని అప్పటి నుడా వీసీ రమేష్ కోర్టుకెక్కారు. నలుగురు ఈనాడు రిపోర్టర్స్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశించింది.
చదవండి: టీడీపీ చీప్‌ ట్రిక్స్‌.. ట్విట్టర్‌ ఖాతాలో అసత్య ప్రచారం

అసలు కేసు నేపథ్యమేంటీ?

నుడా ఏంటీ గడబిడ అంటూ ఈనాడు పత్రిక మే 2022న ఒక వార్తను అచ్చేసింది. అందమైన అబద్దాలన్నింటిని ఏర్చికూర్చి దానికి తన సొంత పైత్యాన్ని జోడించి పాఠకుల ముందేసింది. 

నుడా అంటే నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. దీని పరిధిలో వేస్తోన్న లేఅవుట్‌కు సంబంధించి అనుమతి కోసం నిర్వాహకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. నుడాలో కీలక బాధ్యత నిర్వహిస్తోన్న ఓ అధికారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కథనం అల్లింది. 

ఈ కథనంపై అప్పటి వైస్‌ ఛైర్మన్‌ రమేష్‌ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనం అచ్చేసిందని, ఈనాడుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దానికి విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)