Breaking News

కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి

Published on Wed, 10/16/2024 - 04:05

సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. 

ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్‌ సర్కిల్‌ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)