Breaking News

అమ్మా లే అమ్మా.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి 

Published on Sun, 06/04/2023 - 10:57

పెద్దవంగర: లాలించి జోల పాడి నిద్రపుచ్చే తల్లిని శాశ్వత నిద్ర ఆవహించిందని తెలియక అమ్మా లే అమ్మా.. పాలు ఇవ్వమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై పాల కోసం ఓ పసికందు ఆరాట పడిన విషాద ఘటన ఇది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామానికి చెందిన తేలుకుంట్ల స్వరూప (24), నరేష్‌లకు ఇద్దరు పిల్లలు మూడేళ్ల ఆకాంక్ష, పదినెలల ఆధ్య. నరేష్‌ ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేశాడు.  శుక్రవారం రిజిస్టేషన్‌ చేయించుకుని స్వగ్రామం కొరిపల్లికి ద్విచక్రవాహనంపై కుటుంబంతో సహా తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి తిర్మలగిరి మండల పరిధిలోని తొండ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో వెనుకనుంచి లారీ ఢీకొట్టడంతో స్వరూప అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారులకు గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది నెలల ఆద్య తల్లి స్వరూప మరణించిన విషయం తెలియక పాలకోసం అల్లాడిపోయింది. చనిపోయిన తల్లి రొమ్ము మీద పడి పాల కోసం ఆరాటపడటం చూసిన వారు కంటతడి పెట్టారు. 

ఇది కూడా చదవండి: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..   

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)