Breaking News

దారుణం.. బ్లాక్‌మెయిల్ చేసి 8 మంది అత్యాచారం

Published on Fri, 09/30/2022 - 14:08

జైపూర్‌: రాజస్థాన్ అల్వార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్‌ చేస్తామని  బ్లాక్‌ మెయిల్‌ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్‌ 1న  ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు ర‍మ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్‌గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు.

ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
చదవండి: భార్యపై అనుమానం.. బెడ్‌రూంలో సెల్‌ఫోన్‌ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!

Videos

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)