Breaking News

డబ్బుల కోసం బామ్మను చంపేశాడు

Published on Sun, 01/21/2024 - 05:12

న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది.

గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది.

అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్‌లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)