బంజారాహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం

Published on Tue, 11/26/2024 - 07:50

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం. ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–1లోని సిటీ సెంట్రల్‌ వైపు నుంచి రోడ్డునెంబర్‌–10 వైపు వెళ్తున్న బెంజ్‌ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

ట్రాఫిక్‌ పోలీసుల సాయంతో కారు నడుపుతున్న నజీర్‌ అనే వ్యక్తికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. ప్రమాద సమయంలో కారు యజమానితో పాటు ఆయన భార్య కారులోనే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మద్యం మత్తులో ఒక మహిళ ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు ఎవరు నడుపుతున్నారనేది తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.    

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)