Breaking News

చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Published on Tue, 08/15/2023 - 05:55

ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్‌ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్‌ లాగడంతో రైలు నిలిచింది.

దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ 2.30గం.ల. సమయంలో సిగ్నల్‌ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్‌లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో  రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి.

నలుగురు దొంగలు! 
హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్‌.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది.

సూళ్లూరుపేట స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్‌ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్‌2 నుంచి ఎస్‌8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్‌ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)