Breaking News

న్యూ ఇయర్‌ వేడుకలే టార్గెట్‌..

Published on Tue, 12/17/2024 - 08:51

నాగోలు: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని  నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి  డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, మీర్‌పేట్‌ పోలీసులు వారి నుంచి రూ.1.15 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.. రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్‌ భీశాయ్, మంగీలాల్‌ డాక, బీరా రామ్‌ నగరంలోని మీర్‌ పేట్, అశోక్‌ రెడ్డి కాలనీలో ఉంటూ స్టీల్‌ రేలింగ్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. 

వీరికి  మధ్యప్రదేశ్‌కు  చెందిన  పింటు అలియాస్‌ మోహన్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్‌ విక్రయించాలని నిర్ణయించారు. మోహన్‌సింగ్‌ తాను మధ్యప్రదేశ్‌ నుంచి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తానని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో  మధ్యప్రదేశ్‌ వెళ్లిన వారు ముగ్గురు మోహన్‌సింగ్‌ వద్ద పాపి్రస్టాను కొనుగోలు చేసి రైల్లో నగరానికి తీసుకువచ్చారు. 

అశోక్‌ రెడ్డి నగర్‌లోని తన ఇంట్లో భద్రపరిచిన వారు దానిని బీఎన్‌రెడ్డి నగర్‌ లో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన శంకర్‌ లాల్, కరీంనగర్‌లో ఉంటున్న శర్వాన్‌ ద్వారా నగరంలో అధిక ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, మీర్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి అశోక్‌ రెడ్డి నగర్‌లోని వారి  ఇంటిపై దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్‌ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకరైన మంగీలాల్‌ 2023లో గంజాయి విక్రయిస్తూ హయత్‌నగర్‌ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మోహన్‌ సింగ్, శంకర్‌ లాల్, శర్వాన్‌లను త్వరలో అరెస్ట్‌ చేస్తామని సీపీ తెలిపారు. 

మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా.. 
న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యాల నియంత్రణకు రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగర శివార్లలోని రిసార్ట్‌ల యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ . మురళీధర్,అడిషనల్‌ డీసీపీ షాకీర్‌ హుస్సేన్, ఇన్‌స్పెక్టర్లు కీసర నాగరాజు, భాస్కర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.  

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)