Breaking News

వరకట్న వేధింపులకు వివాహిత బలి!

Published on Fri, 04/11/2025 - 05:32

విడవలూరు: వరకట్నం కోసం వేధించడంతో కల్లాపిరంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత మృతిచెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బోగోలు మండలం తాటిచెట్లపాళెం గ్రామానికి చెందిన బచ్చింగారి సుగుణ (23)కు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన హరికృష్ణతో 2021లో వివాహమైంది.

వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఏడాది తర్వాత అదనపు కట్నంగా రూ.7 లక్షలు తీసుకురావాలని భర్తతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధించడం మొదలుపెట్టారు. ఇవి బుధవారం తారస్థాయికి చేరాయి. మనస్తాపంతో సుగుణ ఇంటి ముందు చల్లే కల్లాపిరంగు పొడిని నీళ్లలో కలిపి తాగింది. సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగున్న బంధువులు ఇది గుర్తించి ఈ సమాచారాన్ని సుగుణ తల్లి అన్నమ్మకు తెలిపారు.

వారు వెంటనే పెద్దపాళెం గ్రామానికి చేరుకుని సుగుణను రాజుపాళెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  తన కుమార్తె మరణంపై అనుమానం ఉందంటూ హరికృష్ణతో­పాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్షి్మలపై అన్నమ్మ గురు­­­వారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో గ్రామంలో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో హరికృష్ణ, అతని తండ్రి నాగూరు కూడా ఉన్నారు. వీరు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, కట్నం కోసం సుగుణను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)