Breaking News

మౌనికది హత్యా, ఆత్మహత్యా! పురుగుల మందు తాగితే తలపై గాయం ఎక్కడిది?

Published on Thu, 05/18/2023 - 12:59

వరంగల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత భూక్యా మౌనిక(28) ఆత్మహత్య చేసుకు న్న ఘటన మండలంలోని పకీరతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మంగీలాల్‌ కథనం ప్రకారం.. మానుకోట జిల్లా నర్సింహులపేట మండలం పకీరతండాకు చెందిన భూక్యా వెంకన్న, బుల్లిల కుమారుడు రాంబాబుతో 11 సంవత్సరాల కిత్రం బయ్యారం మండలంలోని చోక్లాతండాకు చెందిన తేజావత్‌ హుస్సేన్‌ కుమార్తె మౌనికకు వివాహం జరిగింది.

ఈక్రమంలో అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, మామ వేధించడంతో ఇంట్లోనే మౌనిక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

మౌనికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి తేజావత్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తలపైన బలమైన గాయం కావడంతో రక్తస్రావం జరుగుతుందని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)