Breaking News

నేను చనిపోతున్నా.. నా బిడ్డ జాగ్రత్త

Published on Mon, 12/02/2024 - 12:26

జ్యోతినగర్‌(రామగుండం): ‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. ప్రేమ వివాహం చేసుకుని మీకు దూరంగా ఉన్నా.. మొదట్లో ఎంతో ప్రేమగా చూసుకున్న మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’.. అంటూ సెల్ఫీ వీడియో తీసి ఒక వివాహిత బలవన్మరణానికి పాల్ప డింది. 

మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద పల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో నివసిస్తున్న నరేందర్‌ (32), గోదావరిఖనికి చెందిన దేవర కొండ దీప్తిని 2021న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. నరేందర్, దీప్తి స్థానిక అన్నపూర్ణ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయి తే, కట్నం తీసుకు రావాలని నరేందర్‌ కొంతకాలంగా దీప్తిని వేధిస్తున్నాడు. 

ఇదే విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన దీప్తి.. భర్త వేధిస్తున్నందున చనిపోతున్నానని సెల్‌ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసింది. ఉరేసుకున్న దీప్తిని గమనించిన నరేందర్‌ తన మిత్రుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, తన బిడ్డను నరేందర్‌ చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. దీప్తి తండ్రి దివాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్, ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు