Breaking News

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

Published on Wed, 11/06/2024 - 08:40

శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. 

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్‌ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది.  హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్‌ చేసిన సమయంలో మొబైల్‌ స్విఛాఫ్‌ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.    

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)