Breaking News

కిరాణా కొట్టులో గంజాయి!

Published on Mon, 02/26/2024 - 08:03

‘‘ఒడిశాకు చెందిన అనంత కుమార్‌ బారిక్‌ బాలానగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు తనిఖీ చేయగా 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లు బయటపడ్డాయి. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.’’ ‘‘ఇటీవల చర్లపల్లిలోని పాన్‌ డబ్బాలో ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టి 18 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.’’   

సాక్షి, హైదరాబాద్: ... ఇలా పాఠశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయదారులు దందా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులు, కొత్త రుచులతో మత్తులో దించుతున్నారు. తొలుత ఉచితంగా అందించి వ్యసనంగా మారిన తర్వాత ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

పిప్పి నుంచి చాక్లెట్లుగా.. 
గంజాయి నుంచి హాష్‌ ఆయిల్‌ తీసిన తర్వాత పిప్పి మిగులుతుంది. ఈ పిప్పిని వృథాగా పారేయకుండా దానికి కొన్ని రసాయనాలు, ద్రవ రూప చాక్లెట్ల మిశ్రమాన్ని కలిపి వీటిని తయారు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై హాష్‌ ఆయిల్‌ చల్లి ఇవ్వడం, చాకెట్లలో మధ్యలో ఉంచి తక్కువ ధరకు విక్రయించడం చేస్తున్నారు. కొన్నిసార్లు కస్టమర్లను పెంచుకోవడానికి ఉచితంగా కూడా అందిస్తున్నారు. 

ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా.. 
ఈ గంజాయి చాక్లెట్లను గల్లీలోని చిన్న చిన్న దుకాణాలు, పాన్‌షాపులు, కిరాణా కొట్లలో విక్రయిస్తుంటారు. బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి నిర్మాణ రంగంలో వలస కూలీలు వీటిని అక్రమ మార్గంలో వీటిని నగరానికి తీసుకొస్తున్నారు. ఈ చాక్లెట్లు బంగారం, పసుపు రంగులో ఉంటాయి. 5 గ్రాములు బరువు ఉండే ఒక్క చాక్లెట్‌ను రూ.15–20 విక్రయిస్తున్నారు. ఇందులో 14 శాతం గంజాయితో పాటు ఇతర పదార్థాలుంటాయి. 

చారి్మనార్‌ గోల్డ్‌ పేర్లతో.. 
చారి్మనార్‌ గోల్డ్, చారి్మనార్‌ గోల్డ్‌ మునక్కా, వంటి స్థానిక పేర్లతో ఈ గంజాయి చాక్లెట్లను బ్రాండింగ్‌ చేస్తున్నారు. ఆయుర్వేదిక్‌ ఔషధం అంటూ ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. చూసేవాళ్లకు అవి గంజాయి చాక్లెట్లు అని ఏమాత్రం అనుమానం కలగకుండా విక్రయదారులు ఈ ఎత్తుగడ వేస్తున్నారని పోలీసులు తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)