Breaking News

‘నీ వల్లే నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’.. అంటూ వీడియో కాల్‌

Published on Tue, 03/04/2025 - 19:45

అతనొక టైలర్. వృత్తి చేసుకుంటూ జీవనం సాగించడానికి ఒక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అంతా ప్రశాంతంగానే గడిచింది. తిరిగి సొంతూరికి వచ్చిన తర్వాత ఒక మహిళతో వివాహేతర సంబంధానికి దారి తీయగా, అ సంబంధం కాస్తా ఇప్పుడు అతన్ని ప్రాణాలు తీసింది. చాలా కాలం ఆమెతో వివాహేతర బంధాన్ని కొనసాగించిన సదరు వ్యక్తి.. ఆమె బ్లాక్ మెయిలింగ్ కు బలయ్యాడు. ఆమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్న విషయాన్ని ఆమెకు వీడియో కాల్‌ లో తెలిపి మరీ చనిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  ఉన్నావ్  జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని థానేలో టైలర్ గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది తన తల్లి చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన అల్తాఫ్.. ఆపై థానేకు తిరిగి వెళ్లిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఇక్కడే(థానే)లో పని చేసుకోమని చెప్పడంతో అక్కడకు తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సమీప బంధువులైన ఒక మహిళతో  అల్తాఫ్ కు వివాహేతర బంధం ఏర్పడింది. అయితే మహిళతో వివాహేతర సంబంధాన్ని గ్రహించిన అతని కుటుంబ సభ్యులు.. తిరిగి థానేకు పంపించేశారు.

అయినప్పటికీ ఆ మహిళ.. అతన్ని ఫోన్ లో వేధింపులకు గురి చేసింది. తాను కడుపుతో ఉన్నానని, రూ. 10 వేల నుంచి లక్ష వరకూ పంపాలంటూ డిమాండ్ చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  తప్పుడు కేసు బనాయించిన సదరు మహిళ.. డబ్బుల కోసం వేధించేదని అల్తాఫ్ సోదరి అంటోంది. జైలుకు పంపుతానని బెదిరింపులకు గురి చేయడంతోనే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సోదరి రేష్మ స్పష్టం చేసింది.

చనిపోతున్నానని చెప్పినా..
తాను చనిపోయే ముందు వివాహేత బంధం కొనసాగించిన మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని,  నీ వేధింపులు భరించలేక చనిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.  ‘చనిపోతే చనిపో.. నాకేమీ నష్టం లేదు. నాకు భర్త ఉన్నాడు. నువ్వు చనిపోవడం వల్ల నేనేమీ కోల్పోను’ అని చెప్పినట్లు వీడియో కాల్ లో రికార్డు అయ్యింది.

నేను విషం తీసుకుంటున్నా. నేనేమీ డ్రామా ఆడటం లేదు. నేను బాధలో ఉన్నా. నువ్వు అర్థం చేసుకోవడం లేదు.  నీవల్ల నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’ అంటూ మరొక వీడియో కాల్ లో రికార్డు అయ్యింది. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)