Breaking News

తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి.. 

Published on Wed, 07/19/2023 - 13:29

లక్నో: యూపీలోని లక్నోలో ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని అతని ముగ్గురు పిల్లల మీద చూపిస్తూ వారిని కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడు ఓ మూర్ఖుడు. అదృష్టవశాత్తు ఆ పిల్లలకు ఎటువంటి హానీ జరగలేదు. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై పిల్లల్ను ఆసుపత్రికి తరలించగా ప్రమాదమేమీ లేదని చిన్న చిన్న గాయాలు మాత్రం తగిలాయని తెలిపారు వైద్యులు. 

మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామం కాజీఖేడలో సీతారాం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సీతారాంకు అతని బంధువు గోవింద్ యాదవ్ తో తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల వారి మధ్య వివాదం మరింత ముదరడంతో సీతారాంపై ఉన్న కోపాన్ని అతని పిల్లలపై ప్రదర్శించాడు గోవింద్. 

జులై 13న సీతారాం ముగ్గురు పిల్లలు శివాని (8), స్నేహ(4), కృష్ణ(3) మార్కెట్ కు వెళ్తుండగా అటుగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన గోవింద్ వారిని చంపాలనే ఉద్దేశ్యంతో నిర్దయాక్షిణ్యంగా కారుతో గుద్దించేశాడు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు.  అక్కడున్నవారు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారు. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా సేకరించారు పోలీసులు. 

 వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)