Breaking News

యూకే డాక్టర్‌నని చెప్పి.. ఏడుగురి ప్రాణాలు తీశాడు..!

Published on Sun, 04/06/2025 - 19:41

భోపాల్:  యూకే రిటర్న్స్ డాక్టర్ పేరుతో ఓ వ్యక్తి ఆడిన నాటకం.. ఏడుగురి ప్రాణాలు తీసింది. కార్డియాలజీ స్పెషలిస్టునని ‘ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి మధ్యప్రదేశ్ లోని దామోహ్‌ జిల్లాలో ఒక ఆస్పత్రిలో జాయినయ్యాడు. ఇక అంతే స్పెషలిస్టు కదా అని .. మేజర్ ఆపరేషన్లను అతనికే అప్పగించింది ఆ ఆస్పత్రి యాజమాన్యం. అంతే అతను ఆపరేషన్లు చేసిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో అసలు విషయం బయటపడింది. అతను యూకే డాక్టర్ కాదని, కార్డియాలజిస్ట్ అంతకన్నా కాదనే విషయం వెలుగుచూసింది. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘంగా తీవ్రంగా స్పందించింది.

డాక్టర్ ఎన్ జాన్ కెన్ పేరుతో  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు ఓ డాక్టర్. యూకేకు చెందిన కార్డియలాజిస్ట్ నని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ చూపించడంతో అతన్ని డాక్టర్ గా అపాయింట్ చేసుకున్నారు. ఇక అంతే వరుస పెట్టి ఆపరేషన్లు చేసేస్తున్నాడు. హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్ అయితే ఇక ఆపరేషన్ అంటున్నాడు. 

ఆ ఆస్పత్రికి ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కు కూడా ఉండటంతో పేషెంట్లు కూడా ఆపరేషన్ కు సరే అంటున్నారు. ఇలా 15 ఆపరేషన్లు చేయగా, 7 గురు చనిపోయారు. దాంతో దీనిపై ఆరా తీయగా అతను ఫేక్ డాకర్ట్ అనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని  దామోహ్ చైల్డ్ వెల్ఫే్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ వెలుగులోకి తేవడంతో ఆ డాక్టర్ అసలు కథ బయటపడింది. ఒక నెలలోనే అతను చూసిన ఏడుగురు మృతి చెందడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది.

ఫేక్ డాక్టర్ పై  విచారణకు ఆదేశించాం
ఒక డాక్టర్ గా ఆస్పత్రిలో జాయిన్ అయి ఏడుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన సదరు ఫేక్ డాక్టర్ పై విచారణ జరుగుతోందని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది.  ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని, ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన డాక్టర్‌ వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవా  స్కీమ్ కింద ఆపరేషన్ చేసి ఆ నిధుల్ని కూడా దుర్వినియోగం చేశాడు’ అని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూన్ గో పేర్కొన్నారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)