Breaking News

ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..

Published on Thu, 05/30/2024 - 17:13

సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు.  అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.

విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)