Breaking News

వేప పుల్లకోసం వెళ్తే ప్రాణంపోయింది..

Published on Mon, 04/10/2023 - 11:48

వరంగల్: వేపపుల్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండల సూర్యపేట తండాలో ఆదివా రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండా కు చెందిన 3వ వార్డు సభ్యుడు ధారావత్‌ మైబు (42)కు ఎకరం పది గుంటల భూమి ఉంది. ఆదివా రం మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అనంతరం పళ్లపుల్ల(వేపపుల్ల) కోసం బావి దగ్గర ఉన్న వేప చెట్టు వద్దకు వెళ్లాడు. వేపపుల్ల తెంపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. అప్పటికే నీళ్లు అయిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలింది.

 కాగా, ఉదయం చేను వద్దకు వెళ్లిన మైబు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెలక వద్దకు వెళ్లారు. బావి వద్ద చెప్పులు కనిపించడంతో బావిలోకి చూశారు. దీంతో జారి పడినట్లు గుర్తించారు. బయటికి తీసి చికిత్స కోసం నర్సంపేటలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, మృతి చెందినట్లు నిర్ధారించారు. మైబుకు భార్య సుజాత, కుమారుడు మధు, కూతురు హేమలత ఉన్నారు. కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)