తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
కోడి కూరతో అన్నం పెట్టమన్నాడు.. ఆ మాటకు గొడ్డలితో నరికేశాడు
Published on Sat, 03/05/2022 - 16:57
కూనవరం (తూర్పుగోదావరి): కోడి కూర వండలేదని చెల్లెలిని హతమార్చాడో అన్న కూనవరం మండలం కన్నాపురంలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. కన్నాపురానికి కొవ్వాసి నందా కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతడి సోదరి సోమమ్మ(20)ను చాన్నాళ్ల క్రితం మరొకరికి దత్తత ఇచ్చారు. వారం రోజుల క్రితం ఆమె తన అన్న నందా ఇంటికి వచ్చింది. కోడి కూర వండాలని సోదరికి చెప్పి గురువారం నందా బయటకు వెళ్లాడు.
మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి, కోడి కూరతో అన్నం పెట్టాలని చెల్లెలికి చెప్పాడు. కోడి కూర వండలేదని ఆమె చెప్పడంతో కోపోద్రిక్తుడై బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారుజామున వచ్చి మళ్లీ ఆమెతో గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెను నరికేశాడు. సంఘటన స్థలంలోనే సోమమ్మ మృతి చెందింది. ఎటపాక సీఐ గజేంద్రకుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నందా పరారీలో ఉన్నాడు.
చదవండి: (లక్షలాది రూపాయలు వడ్డీకిచ్చి.. మనోవేదనతో)
Tags : 1