Breaking News

ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Published on Wed, 11/27/2024 - 05:00

జీడిమెట్ల: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. ఓ భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్‌–5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్‌ అనే వ్యక్తి ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పేరిట ప్లాస్టిక్‌ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు.

పరిశ్రమ గ్రౌండ్‌ ఫ్లోర్‌ సహా మరో రెండు ఫ్లోర్లు ఉండగా ఆపైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా..  మంగళవారం జనరల్‌ షిఫ్ట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ మూడో అంతస్తులోని రేకుల షెడ్డులో కొంతమంది కారి్మకులు ఆర్‌పీ (రీప్రాసెసింగ్‌) మెషీన్‌ వద్ద పనులు చేస్తున్నారు. 12.30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్మికులు బతుకు జీవుడా అంటూ కిందకు పరుగులు తీశారు.  

శ్రమించిన 50 మంది ఫైర్‌ సిబ్బంది.. 
సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ నిల్వలు ఉండటంతో భారీగా మంటలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి ఉన్నతాధికారులకు వివరించడంతో 8 వాహనాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. 

దాదాపు అయిదు ఫైర్‌ స్టేషన్‌ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడో అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటోసై్కలిఫ్ట్‌ను తెప్పించారు. మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు. 
 


పైనుంచి కింది అంతస్తు వరకు వ్యాపించిన మంటలు.. 
పరిశ్రమ విశాలంగా ఉండటంతో పాటు లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ బ్యాగులు నిల్వ ఉన్నాయి. పైన ఆర్‌పీ యంత్రం వద్ద అంటుకున్న మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. పరిశ్రమ భవనం మంటల తాకిడికి రెండో అంతస్తు గోడలు కూలిపోయాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటనా స్థలికి బాలానగర్‌ ఏసీసీ హన్మంతరావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లే‹Ù, ఎస్‌ఐలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?