Breaking News

బద్లాపూర్‌ భగభగ!

Published on Wed, 08/21/2024 - 04:55

థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్‌గార్టెన్‌ స్కూల్‌లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

బద్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్‌ ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్‌ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్‌ను అరెస్ట్‌ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్‌ ప్రిన్సిపల్, క్లాస్‌ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్‌ చేసింది.

వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు అసిస్టెంట్‌ ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.  

ఆ ఆరోపణలు అవాస్తవం 
కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్‌ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్‌ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు. 

మంత్రి చెప్పినా ససేమిరా.. 
వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్‌ బంద్‌నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్‌గార్టెన్‌ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.

చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్‌ క్లియర్‌ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్‌ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో రైల్‌ రోకో కారణంగా అంబర్‌నాథ్‌–కజ్రట్‌ మార్గంలో 30 వరకు సబర్బన్‌ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)