Breaking News

మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం

Published on Wed, 09/13/2023 - 11:43

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. 

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు.

ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్‌ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్‌మెంట్‌లోనే పోలీసులకు చిక్కారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)