Breaking News

పురుగుల మందు తాగి.. చెట్టుకు ఉరేసుకుని..

Published on Tue, 02/28/2023 - 03:02

చందంపేట: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు ఉరేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్‌(20) డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి కూలి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.

కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి(16) దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఫస్ట్‌ ఇంటర్‌ చదువుతోంది. దేవి గతేడాది చింతపల్లి మండల పరిధిలోని మోడల్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న సమయంలో రాకేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇటీవల ఇరువురూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రాకేశ్‌ కుటుంబసభ్యులు సానుకూలంగా ఉండగా దేవి తరఫు బంధువులు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి ఆదివారం రాకేశ్‌కు ఫోన్‌ చేసి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నేను వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరింది. దీంతో రాకేశ్‌ అదే రోజు ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చి బైక్‌పై నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులోని ఉచ్చలబుడ్డి వద్దకు చేరుకున్నారు.

తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసు కున్నారు. కాచరాజుపల్లి గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)